Flat purchase
డిసిసిబి బ్రాంచీల ద్వారా Main Code: 6251; Sub Code: 8420
Purpose :
గృహము యొక్క నిర్మాణము/కొనుగోలు కొరకు దీర్ఘకాలిక ఋణము
డిసిసిబి బ్రాంచీల ద్వారా
Eligibility :
జిల్లాలో గల డిసిసిబి యొక్క 'బి' క్లాస్ సభ్యులు (70 సం॥ల లోపు)
ఋణ గ్రహీత యొక్క సిబిల్(CIBIL) స్కోరు 700 పై బడి వుండవలెను.
Security :
ఎ) ప్రాథమికంగా కొనుగోలు/నిర్మాణము చేయబోవు గృహము లేదా ఫ్లాటు. (బి) ఋణ మొత్తములో 2.5% నికర ఆదాయము కలిగిన దరఖాస్తుదారుతో
సమాన ఆదాయము కల ఒక హామీదారు.
సి) గ్రామములలో గల గృహ నిర్మాణ వ్యయములో 50% విలువ గల వ్యవసాయ
భూమి హామీ.
డి) వ్యవసాయ భూముల యొక్క ఎస్.ఆర్.ఎ. విలువ 100% లేదా ఎకరమునకు రు. 6,00,000/-లు ఏది తక్కువ అయితే ఆ విలువ హామీగా పరిగణింపబడును. (ఇ) అర్బన్ ఏరియాలోని స్థలము యొక్క ఎస్.ఆర్.ఏ. విలువలో 100% మరియు ఇంజనీరు ఎస్టిమేషన్లో 60% విలువను హామీగా పరిగణించవలెను.
Maximun Loan Amount :
రు.75,00,000/-లు
నగరములు / పట్టణములు
గరిష్ట ఋణమొత్తం (లక్షలలో)
1. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మరియు వై.ఎస్.ఆర్ తాడిగడప మునిసిపాలిటీ పరిధి వరకు
75.00,
2. మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు మరియు సెమీ అర్బన్/మునిసిపల్ ఏరియా లో
50.00,
3. మిగిలిన అన్ని మండల కేంద్రములలో
30.00,
4. జిల్లాలో ఇతర ప్రాంతములలో
20.00,
5. స్థలము యొక్క యస్.ఆర్.ఎ. విలువలో 80%
6. ఇంజనీర్ ఎస్టిమేషన్లో 75% వాల్యూ
Interest :
10.5% pa (షుమారు నెలకు రూ. 100/- లకు 88 పైసలు)
Delinquent Interest :
2.00% p.a (షుమారు నెలకు రూ. 100/-లకు 16 పైసలు)
Repayment Period :
25 సంవత్సరములు అనగా 300 నెలలు లేదా 70 సం॥లు వయస్సు వచ్చు లోపు పూర్తి చెల్లింపు. (మారిటోరియం మొదటి వాయిదా బట్వాడా తేదీ నుండి 6 నెలలు)
Field Inspection :
1. రూ. 10,00,000/-ల వరకు సంబంధిత బ్రాంచి మేనేజరు & సూపర్వైజర్. 2. రూ. 10,00,001/-ల నుండి రూ. 20,00,000/-ల వరకు సంబంధిత DCPC ఎజియం & సూపర్వైజర్.
3. రూ.20,00,000/-లు పై బడినచో సంబంధిత DCPC డిజియం & సూపర్వైజర్.
Share Price :
ఋణ మొత్తములో 4%
Processing Fee :
0.5%+GST
Loan Sanction Authority :
1. రూ.10,00,000/-ల వరకు సంబంధిత DCPC ఎజియం
2. రూ.10,00,001/-ల నుండి రూ.20,00,000/-ల వరకు సంబంధిత DCPC డిజియం
3. రూ.20,00,000/-లు పై బడిన ఋణములు బ్యాంకు యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారి.
Legal Advice :
ధరఖాస్తును సంబంధిత దస్తావేజులు, ఇ.సి వగైరాలతో (కాలమ్ నెం.11లో సూచించిన విధముగా) బ్యాంకుచే నియమింపబడిన న్యాయసలహాదారుల నుండి సలహా పొందిన పిమ్మట సంబంధిత బ్రాంచి / డిసిపిసిలో మంజూరు నిమిత్తం దాఖలు చేయవలెను.
Action :
1. ఋణము మంజూరు దరిమిలా మంజూరు ఉత్తర్వులలోని (LSO) నిబంధనలను అనుసరించి ఋణము బట్వాడా చేయవలెను.
2. యస్. ఆర్. ఎ నందు తనఖా బాండు రిజిస్టర్ దరిమిలా ఇసి నందు సదరు ఎంట్రీని సరి చూసుకొని మాత్రమే ఋణ బట్వాడా జరుపవలెను. 3. గృహ కొనుగోలు నిమిత్తము ఋణ మంజూరు చేయబడినచో అమ్మకందారు పేరుతో డిడి జారీ చేయుట ద్వారా సదరు ఋణము బట్వాడా చేయవలెను. 4. గృహ కొనుగోలు కొరకు ఋణ మంజూరు చేసినచో ఎస్.ఆర్.ఎ ఆఫీసు నందు కొనుగోలు రిజిస్ట్రేషన్ వెంటనే సదరు ఆస్తి బ్యాంకు పేరుతో తనఖా రిజిస్ట్రేషన్ చేయించవలెను.
Insurance :
గృహము యొక్క మొత్తము విలువకు ఋణము యొక్క తిరిగి చెల్లించు కాలపరిమితి పూర్తి అగువరకు ఇన్సూరెన్సు పాలసీ తీసుకొనవలెను.
Others :
1. ఋణము పొందుటకు ముందుగా కేంద్ర / ప్రాంతీయ కార్యాలయము నుండి కన్సెంట్ పొందవలెను.
2.ఒరిజినల్ ధరఖాస్తు సంబంధిత డిసిపిసిలో భద్రపరచి, జిరాక్స్ కాపినీ బ్రాంచి వారికి అందజేయవలెను.