Education Loans
Main Code: 6251; Sub Code: 8410
Purpose :
బ్యాంకు ఖాతాదారుల యొక్క పిల్లల ఉన్నత విద్య మరియు వృత్తి విద్య అనగా B.E./B.Tech./M.Tech./BVSc./MVSc./MBBS/MD/BDS/CA/ |MCA/MBA/M.Sc. అభ్యసించుటకై ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు వగైరా అవసరములు తీర్చుట కొరకు.
దీర్ఘకాలిక ఋణము డిసిసిబి బ్రాంచీల ద్వారా
Eligibility :
1. జిల్లాలో గల బ్యాంకు యొక్క 'బి' క్లాసు సభ్యులైన వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, వృత్తివంతులు అయిన వారి పిల్లలు.
2. సదరు విద్యార్థి ఉన్నత విద్యకై వెళ్ళు యూనివర్సిటీ ర్యాంకు 2000 లోపు మరియు సంబంధిత దేశంలో 500 లోపు ర్యాంకు కలిగి ఉండాలి.
3. ఋణ గ్రహీత మరియు హామీదారు యొక్క సిబిల్(CIBIL) స్కోరు 700 పై బడి వుండవలెను.
4. దరఖాస్తుదారు, విశ్వవిద్యాలయం ర్యాంకింగ్ 100 లోపు వుండవలెను.
Security :
స్థిరాస్తి హామీ :
(ఎ) గృహము తనఖా అయినచో సదరు గృహము ఉన్న స్థలము యొక్క ఎస్.ఆర్.ఎ. వాల్యూ లో 80% + గృహము యొక్క ఇంజనీరు ఎస్టిమేషన్ వాల్యూలో 60%. (బి) వ్యవసాయ భూమి అయినచో ఎస్.ఆర్.ఎ. వాల్యూ లేదా ఎకరమునకు రు. 6,00,000/-లు ఏది తక్కువ అయితే ఆ విలువ. (విజయవాడ పరిసర ప్రాంతములు మరియు సర్క్యులర్ నెం. ఎన్.ఎఫ్.ఎస్/2020-21 తేదీ 20.07.2020లో తెలియజేయబడిన ప్రాంతములో గల వ్యవసాయ భూములకు ఎస్.ఆర్.ఒ. విలువలో 25% ఋణ అర్హతగా పరిగణింపబడును)
సి) కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగస్థులు కనీసం మూడు సంవత్సరములు సర్వీసు పూర్తిచేసి, ఇంకనూ కనీసం అయిదు సంవత్సరములు సర్వీసు కలిగి
ఉండవలెను.
Maximun Loan Amount :
ఎ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్థుల యొక్క నికరజీతమునకు 20 రెట్లు. (1/3 జీతము ఇంటికి తీసుకు వెళ్ళేలా ఉండాలి.)
(బి) వ్యవసాయదారులకు ఋణము యొక్క పూర్తి కాలపరిమితిలో వారియొక్క స్థూల ఆదాయములో 40%.
సి) వ్యాపారస్థులకు ఋణము యొక్క పూర్తి కాలపరిమితిలో స్థూల ఆదాయములో
35%
డి) కోర్సు యొక్క అంచనా వ్యయములో 75% మాత్రమే ఋణముగా మంజూరు చేయబడును. ఇ) గరిష్టముగా రు. 40,00,000/-లు ఏది తక్కువ అయితే అది | ఋణ మొత్తముగా నిర్ణయింపబడును.
Interest :
10.5% p.a (షుమారు నెలకు రూ.100/-లకు 88 పైసలు)
Delinquent Interest :
2.00% pa (షుమారు నెలకు రూ. 100/-లకు 16 పైసలు)
Repayment Period :
సదరు విద్యార్థి యొక్క కోర్సు పూర్తి అయిన 6 నెలల వరకు ప్రతినెలా వడ్డీ చెల్లించవలెను. కోర్సు పూర్తి అయిన దరిమిలా 60 నెలసరి వాయిదాలలో
చెల్లించవలెను.
Field Inspection :
1. రూ. 10,00,000/-ల వరకు సంబంధిత బ్రాంచి మేనేజరు & సూపర్వైజర్. 2. రూ.10,00,001/-ల నుండి రూ.20,00,000/-ల వరకు సంబంధిత DCPC ఎజియం & సూపర్ వైజర్.
3. రూ.20,00,000/-లు పై బడినచో సంబంధిత DCPC డిజియం & సూపర్వైజర్.
Share Price :
ఋణ మొత్తము పై 4%
Processing Fee :
0.5%+GST
Loan Sanction Authority :
1. రూ. 10,00,000/-ల వరకు సంబంధిత DCPC ఎజియం
2. రూ. 10,00,001/-ల నుండి రూ.20,00,000/- ల వరకు సంబంధిత
DCPC డిజియం
3. రూ.20,00,000/-లు పై బడిన ఋణములు బ్యాంకు యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారి.
Legal Advice :
ధరఖాస్తును సంబంధిత దస్తావేజులు, ఇ.సి వగైరాలతో (కాలమ్ నెం.12లో సూచించిన విధముగా) బ్యాంకుచే నియమింపబడిన న్యాయసలహాదారుల నుండి సలహా పొందిన పిమ్మట సంబంధిత బ్రాంచి / డిసిపిసిలో మంజూరు | నిమిత్తం దాఖలు చేయవలెను.
Action :
1. ఋణము మంజూరు దరిమిలా మంజూరు ఉత్తర్వులలోని (LSO) నిబంధనలను అనుసరించి ఋణము బట్వాడా చేయవలెను. 2. యస్.ఆర్.ఎ నందు తనఖా బాండు రిజిస్టర్ దరిమిలా ఇ.సి నందు సదరు ఎంట్రీని సరి చూసుకొని మాత్రమే ఋణ బట్వాడా జరుపవలెను. | 3. విద్యార్థి యొక్క కోర్సు ప్రోగ్రామ్ లో తెలియజేసిన విధముగా విద్యాసంస్థకు డిడి/చెక్కు ద్వారా ఋణ బట్వాడా చేయవలెను.
4. విద్యార్థి అప్పటికే ఫీజ చెల్లించియున్న యెడల సదరు రశీదులు దాఖలు చేసినచో ఆ విద్యార్థి ఎస్.బి. అకౌంట్ నకు బదిలీ చేయవలెను.
Insurance :
గృహము యొక్క మొత్తము విలువకు ఋణము తిరిగి చెల్లించు కాలపరిమితి పూర్తి అగువరకు ఇన్సూరెన్సు పాలసీ తీసుకొనవలెను.
Others :
1. ఋణము పొందుటకు ముందుగా కేంద్ర / ప్రాంతీయ కార్యాలయము నుండి కన్సెంట్ పొందవలెను.
2. ఒరిజినల్ ధరఖాస్తు సంబంధిత డిసిపిసిలో భద్రపరచి, జిరాక్స్ కాపినీ బ్రాంచి వారికి అందజేయవలెను.
3. వ్యవసాయ భూములు అయినచో Weband portal నందు సదరు ఋణ వివరములు విధిగా నమోదుపరచి approve చేయవలెను.