Loading...

Switching to dark mode

Switching to light mode

Switching to RTL mode

Switching to default mode

Loan Details

Cash Credit

Main Code: 6050; Sub Code: 1040

Purpose :
వ్యాపార మూలధన అవసరముల కొరకు స్వల్పకాలిక ఋణము. డిసిసిబి బ్రాంచీల ద్వారా

Eligibility :
1. ఆంధ్రప్రదేశ్ జనరల్ సేల్స్ టాక్స్ రిజిస్ట్రేషన్ కలిగిన హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్థులు 2. దరఖాస్తుదారుడు సొంత వ్యాపారము లేదా పార్టనర్షిప్ వ్యాపారము కావచ్చు. 3. ఋణ గ్రహీత యొక్క సిబిల్(CIBIL) స్కోరు 700 పై బడి వుండవలెను.

Security :
1. ప్రాథమిక హమీ: ఋణ మొత్తములో 25% సదరు వ్యాపార సంస్థల యొక్క నిల్వ సరుకులు (వాటి యొక్క విలువ కొనుగోలు ధర లేదా ప్రస్తుత ధరను బట్టి నిర్ణయించవలెను) వారి ఖాతా పుస్తకములలో గల 90 రోజుల లోపు ఉన్న రావలసిన బకాయిలు కలిపి ప్రాథమిక హామీగా పరిగణించబడును. మేనేజరు, సూపర్వైజరు సదరు స్టాకును తనిఖీ చేసి రిపోర్టు ఇవ్వవలెను. 2. స్థిరాస్థి హామీ : ఎ) గృహము తనఖా అయినచో సదరు గృహము ఉన్న స్థలము యొక్క ఎస్.ఆర్.ఎ. విలువలో 80% మరియు గృహము యొక్క ఇంజనీరు ఎస్టిమేషన్ విలువలో 60% బి) వ్యవసాయ భూమి అయినచో ఎస్.ఆర్.ఎ. విలువ లేదా ఎకరమునకు రు. 6,00,000/-లు ఏది తక్కువ అయితే ఆ విలువను పరిగణించి హామీగా ఇవ్వవలెను

Maximun Loan Amount :
రూ.40,00,000/-లు లేదా దరఖాస్తుదారునిచే ప్రభుత్వము వారికి దాఖలు చేయబడిన సేల్స్ టాక్స్ రిటర్న్ |తెలియజేయబడిన గత మూడు సంవత్సరముల యొక్క వ్యాపారము మరియు రాబోవు రెండు సంవత్సరముల యొక్క అంచనా వ్యాపారము యొక్క సరాసరి మొత్తములో ఏది తక్కువ అయితే ఆ మొత్తము ఋణ అర్హత మొత్తముగా నిర్ణయించబడును.

Interest :
12.00%pa (షుమారు నెలకు రూ.100/- లకు 1/- రూపాయి)

Delinquent Interest :
2% p.a (షుమారు నెలకు రూ. 100/-లకు 16 పైసలు)

Repayment Period :
ప్రతి నెల వడ్డీ చెల్లించుచూ, ప్రతి సంవత్సరము రెన్యువల్ చేయించుకోవలెను.

Field Inspection :
1. రూ.10,00,000/-ల వరకు సంబంధిత బ్రాంచి మేనేజరు & సూపర్వైజర్. 2. రూ.10,00,001/-ల నుండి రూ.20,00,000/-ల వరకు సంబంధిత DCPC ఎజియం & సూపర్వైజర్. 3. రూ.20,00,000/-లు పై బడినచో సంబంధిత DCPC డిజియం & సూపర్వైజర్

Share Price :
ఋణ మొత్తములో 4%

Processing Fee :
0.5%+GST

Loan Sanction Authority :
1. రూ. 10,00,000/-ల వరకు సంబంధిత DCPC ఎజియం 2. రూ.10,00,001/-ల నుండి రూ.20,00,000/-ల వరకు సంబంధిత DCPC డిజియం 3. రూ. 20,00,000/-లు పై బడిన ఋణములు బ్యాంకు యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారి.

Legal Advice :
ధరఖాస్తును సంబంధిత దస్తావేజులు, ఇ.సి వగైరాలతో (కాలమ్ నెం. 12లో సూచించిన విధముగా) బ్యాంకుచే నియమింపబడిన న్యాయసలహాదారుల నుండి సలహా పొందిన పిమ్మట సంబంధిత బ్రాంచి / డిసిపిసిలో మంజూరు నిమిత్తం దాఖలు చేయవలెను.

Action :
1. పరపతి పరిమితి ఋణము మంజూరు దరిమిలా మంజూరు ఉత్తర్వులలోని (LSO) నిబంధనలను అనుసరించి ఋణము బట్వాడా చేయవలెను. 2. యస్.ఆర్.ఎ నందు తనఖా బాండు రిజిస్టర్ దరిమిలా ఇ.సి నందు సదరు ఎంట్రీని సరి చూసుకొని మాత్రమే ఋణ బట్వాడా జరుపవలెను. 3. ఋణ దరఖాస్తుదారుని పేరుతో క్యాష్ క్రెడిట్ ఖాతాను తెరిచి తద్వారా ఋణ బట్వాడా చేయవలెను. 4. సంవత్సరములో క్యాష్ క్రెడిట్ ఖాతా లావాదేవీలు మంజూరు చేయబడిన ఋణ మొత్తమునకు రెండింతలు ఉండవలెను. 5. సదరు క్యాష్ క్రెడిట్ యొక్క గరిష్ట నిల్వ సదరు స్టాక్ స్టేట్ మెంట్ గల స్టాక్ విలువలో 75%నకు మించరాదు. 6. ఖాతాదారుడు క్యాష్ క్రెడిట్ నుండి withdraw చేయునపుడు చెక్కుతో పాటు స్టాక్ స్టేట్మెంట్ తప్పక జతపరచవలెను. 7. ప్రతి నెల మేనేజరు మరియు సూపర్వైజరు స్టాకును తనిఖీ చేసి రిపోర్టు ఇవ్వవలెను.

Insurance :
షాపు మరియు గోడౌన్లో ఉన్న స్టాక్స్ నకు. గృహ ఆస్థి తనఖా అయినచో గృహము యొక్క మొత్తము విలువకు ఋణము యొక్క తిరిగి చెల్లించు కాలపరిమితి పూర్తి అగువరకు ఇన్సూరెన్సు పాలసీ తీసుకొనవలెను.

Others :
1. ఋణము పొందుటకు ముందుగా కేంద్ర / ప్రాంతీయ కార్యాలయము నుండి కన్సెంట్ పొందవలెను. 2. ఒరిజినల్ ధరఖాస్తు సంబంధిత డిసిపిసిలో భద్రపరచి, జిరాక్స్ కాపీనీ బ్రాంచి వారికి అందజేయవలెను. 3. వ్యవసాయ భూమి హామీ అయినచో Weband portal నందు సదరు ఋణ వివరములు విధిగా నమోదుపరచి approve చేయవలెను.

Apply For Loan